Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్బమ్‌లో ఈ ఏడాది ఆరంభంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసలో బొగోటి గ్రామానికి చెందిన లాలన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ నిందితుడు సోమవారం సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులపై .. బెంగాల్ రాష్ట్ర పోలీసులు సీబీఐ కేసును నమోదు చేశారు. బీర్బమ్‌లో జరిగిన హింసలో మహిళలు, చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. 8 నెలల క్రితం నిందితుడు లాలన్ షేక్‌ను జార్ఖండ్‌లో అరెస్టు చేశారు.