Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇవాళ ఓ బాలుడు పాఠశాలకు వెళ్తున్న బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ద్వారక జిల్లా ఏరియాలో యాసిడ్ దాడి ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.