Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ ఇస్తున్నది. ఇండియాలో తొలిసారి క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ అడ్డాగా క్షిపణులను తయారీ చేయడం విశేషం. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణకు చెందిన కళ్యాణి సంస్థ భారతీయ ఆర్మీకి మిస్సైల్ కిట్స్ అందించడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రక్షణ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నట్లు, బాబా కళ్యాణ్ జీకి తన ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు.