Authorization
Fri May 16, 2025 06:48:13 pm
హైదరాబాద్: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20) విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రిషబ్ పంత్ 46 వద్దే ఆగిపోయాడు. ప్రస్తుతం పుజారా, శ్రేయస్ ఇద్దరు క్రీజులో ఆడుతున్నారు. దీంతో లంచ్ సమయానికి ఇప్పటి వరకు టీంఇండియా 40 ఓవర్లలలో నాలుగు వికెట్ల నష్టంతో 128 పరుగులు చేసింది.