Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఓ బస్సు 60 మంది ప్రయాణికులతో పంజాబ్ రాష్ట్రమైన లుధియాన నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి వెళ్తోంది. ఈ తరుణంలో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పైకి రాగానే వేగంగా వస్తున్న డీసీఎం వాహనం బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.