Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒకప్పుడు 340 బిలియన్ డాలర్ల సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను దాటి ప్రపంచ కుబేరుడిగా మారిన మస్క్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 51 ఏళ్ల ఎలాన్ మస్క్ తన సంపదలో జనవరి నుంచి దాదాపు 100-168.5 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ఈ లెక్కన ప్రస్తుతం ఆర్నాల్ట్ 172.9 బిలియన్ డాలర్ల నికర విలువ కంటే మస్క్ సంపద తగ్గిపోయింది. దాంతో, 2021 సెప్టెంబర్ నుంచి ఆర్జనలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ తొలిసారి రెండో స్థానానికి పడిపోయారు. ఈ తరుణంలో అర్నాల్ట్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ట్విట్టర్ కొనుగోలు కోసం టెస్లాలో మస్క్ 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ క్రమంలోనే ఆయన సంపద తగ్గిపోయింది.