Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీలోని ద్వారక జిల్లాలో ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఓ 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ఇద్దరు బాలురు ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చి తన అక్కపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు బాధితురాలి చెల్లెలు చెబుతున్నది. ఈ తరుణంలో యాసిడ్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ విమెన్) విచారణ చేపట్టింది.
ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు చెందిన ఓ బృందం బాధితురాలు చికిత్స పొందుతున్న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ యాసిడ్ దాడి ఘటనపై బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసులో విచారణ జరిపి బాధితురాలికి అవసరమైన ప్రతి సాయం అందజేస్తామని తెలిపింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.