Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాట్నా: బీహార్‌లో కల్తీ మద్యానికి ఆరుగురు బలయ్యారు. సరన్ జిల్లాలో ఛప్రాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు మద్యం తాగిన అనంతరం అనారోగ్యం పాలయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మిగతా అదుగురు గ్రామంలోనే మృతి చెందారు. మరికొందరు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపామని పోలీసులు తెలిపారు. అయితే వీరంతా కల్తీ మద్యంతోనే మృత్యువాత పడ్డారని కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. మృతులు సంజయ్ సింగ్, హరిందర్ రామ్, కునాల్ సింగ్, అమిత్ రంజన్‌లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు.ఈ ఘటనకు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బాధ్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే జనక్ సింగ్ పేర్కొన్నారు. సీఎం సొంత గ్రామంలోనే ముగ్గురు మరణించారని అన్నారు.