Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిస్తూ, కొన్ని షరతులను విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూదని కండిషన్ పెట్టింది. షర్మిల ఇంటి వద్ద ఉంచిన బ్యారికేడ్లను తొలగించాని పోలీసులను ఆదేశించింది.
ఈ తరుణంలో షర్మిల మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు, పాలేరు పార్టీ కార్యాలయానికి ఈనెల 16న భూమి పూజ జరుగుతుందని, పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని తెలిపారు. తెలిపారు