Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం చోటుచేసుకుంది. కీరవాణి తల్లి భానుమతి ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సంబంధం అనారోగ్యంతో బాధపడుతున్నారు. కీరవాణి తల్లి చాలాకాలంగా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో మూడ్రోజుల కిందట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. భానుమతి భౌతికకాయాన్నిదర్శకుడు రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. మాతృవియోగం పొందిన కీరవాణికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.