Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బుధవారం ఉదయం నైరుతీ ఢిల్లీలోని ద్వారకా మెట్రో స్టేషన్ వద్ద సోదరితో కలిసి ఉన్న 12వ తరగతి చదువుతున్న బాలిక ముఖంపై బైక్‌పై వచ్చిన ఇద్దరు యాసిడ్ పోశారు. బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె ముఖం, కళ్లకు 8 శాతం మేర యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
ఈ తరుణంలో యాసిడ్ దాడిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఢిల్లీలోని ప్రతి ఆడబిడ్డ భద్రత మాకు ముఖ్యమని అన్నారు. అని హిందీలో ట్వీట్ ద్వారా.బాలికపై యాసిడ్ దాడికి సంబంధించిన న్యూస్ వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు.