Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పేదరికం తగ్గింపులోనూ ఆర్థిక అభివృద్ధిలోనూ విద్య మరియు పిల్లల ఆరోగ్యం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మధ్యాహ్న భోజన పథకాల ద్వారా స్కూల్ పిల్లలకు భోజనం అందించడంలో స్కూల్ పిల్లల హాజరు పెరగడానికి దోహతం చేస్తుంది. అంతేకాక చిన్నపిల్లలకు సరైన ఆహారం అందేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4(2015-2016) ప్రకారం రాష్ట్ర ప్రజానికంలో 85% ప్రజలకు కోడిగుడ్డు తినడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు పౌష్టికాహారం పిల్లలకు అందించడంలో కులమతాల భావజాలాల జోక్యం ఏ విధంగానూ ఉండరాదు. పౌష్టికాహార విషయంలో వీటి జోక్యం వలన వివిధ జాతి పిల్లల పైన ప్రభావం పడుతుంది.
కోడిగుడ్లు ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లోని అందరి పిల్లలకు అందించాలి. అంగన్వాడీల లోను అదనపు పాలు పెరుగు అందించాలి గుడ్లు తినని వారికి దోహదపడతాయి జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రకారం మరియు పవిత్ర ఆహారాన్ని తునాల డాక్టర్ల లాయర్ల తల్లిదండ్రుల పిల్లల డిమాండ్ల ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఐదు రోజులు గుడ్లు అందించాలి దీని ద్వారా వారికి వివిధ రకాల పౌష్టికాహార ఉపయోగాలు జరుగుతాయి. బీజేపీ మెజార్టీగా ఉన్న 19 రాష్ట్రాలలోనే 14 రాష్ట్రాలలో మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో అంగన్వాడి కేంద్రాలలో మధ్యాహ్నం భోజన పథకంలో కోడిగుడ్లు అందించడం లేదు. చత్తీస్గడ్ కర్ణాటక మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన మైనార్టీ శాఖాహారాలు, మధ్యాహ్నం భోజన పథకంలో కోటుదలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వివిధ రకాల చీ+ఉ ఐన అక్షయపాత్ర ఫౌండేషన్ లాంటివారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించడం ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎవరైనా గుడ్లు వండి పెడితే ఆ మహిళలను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆదివాసులు అధికంగా ఉన్న మూడు ప్రాంతాలలో గుడ్లను ఇవ్వడం మానివేశారు.
2021 నవంబర్లో కర్ణాటక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది అక్కడ అనేకమంది తల్లిదండ్రులు పౌష్టికాహారాన్ని పునులు డాక్టర్లు డిమాండ్ ప్రకారం మధ్యాహ్నం భోజనంలో గుడ్లు ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఏడు రాష్ట్రాలలోనూ ఇస్తున్నారు 2015 లో ఇలాంటి ప్రయత్నాన్ని కొన్ని మతాలవారు ఆపివేశారు. వారి వాదన ప్రకారం ఆహార నియమాలలో సాంప్రదాయాన్ని పాటించాలని గుడ్లు ఇవ్వడం ద్వారా సహకారాలు అలవాట్లపై వివక్షత చూపించినట్లుదని చెబుతున్నారు. దురదృష్ట సా వత్తు భారతదేశ ఆహార విధానాలను శాస్త్రీయంగా కాక వివిధ అంశాల ఆధారంగా ఉంటున్నాయి. విధమైన విధానాల ద్వారా దేశ ప్రజల వివిధ ఆహారపు అలవాట్లను నేరపురితంగా కూడా చూస్తున్నారు. మాంసము గుడ్లు చేపలు లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం ద్వారా దేశంలోని అధిక శాతం ప్రజలు విటమిన్ A/B12/zinc/Calcium/ విటమిన్ డి/ ఐరన్ లాంటి వాటి లోపాలతోటి పౌష్టికాహార లోపం రక్తహీనత మరియు పలు అనారోగ్య పాలవుతున్నారు. కనుక దేశవ్యాప్తంగా బడులలో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం లో పౌష్టికాహారాన్ని అందించాలని ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభ డిమాండ్ చేస్తుంది.