Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆరంభంలోనే అదుర్స్ అనిపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఆడుతున్న తన ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ 120 పరుగులు చేశాడు. పదిహేనేళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫస్ట్ సెంచరీ కొట్టాడు.
అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ ఎంట్రీకి ముందు మహారాష్ట్ర తరఫున ఏడు లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గత రంజీ సీజన్ వరకు ముంబై జట్టుతో ఉన్న అర్జున్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. దీంతో ఈ ఏడాది జూన్‌లో ముంబై జట్టును వదిలేశాడు. గోవా జట్టు కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొని అద్భుతంగా ఆడాడు. కోచ్‌లను మెప్పించి గోవా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా క్రీజులోకి వచ్చాడు. తొలిరోజు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్ 15 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు అద్భుతంగా ఆడాడు. మొత్తంగా 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు.