Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు ఆ కేంద్రం గోడకు కన్నంపెట్టి అందులోంచి బయటపడ్డారు.పారిపోయేందుకు ప్రయత్నించగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆరుగురు బాల నేరస్థులు ఆ సెక్యూరిటీ గార్డ్‌ను కిందకు తోసేశారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
ఈ విషయం తెలిసుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది జువైనల్ హోమ్‌కు చేరుకున్నారు. ఆ కేంద్రం గోడకు కన్నం ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి తప్పించుకున్న ఆరుగురు పిల్లలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.