Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పర్వతమాల పథకంలో భాగంగా శ్రీశైలం-ఈగలపెంట మధ్య రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధిత ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రీ ఫీజబులిటీ అధ్యయనం కూడా పూర్తయింది. వచ్చే మార్చి నుంచి శ్రీశైలం-ఈగలపెంట మధ్య రోప్ వే ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవనుంది.
రాష్ట్రంలో మరో మూడు పర్యాటక ప్రాంతాల్లోనూ రోప్ వే ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అవి విజయవాడ ఇంద్రకీలాద్రి-భవానీ ద్వీపం, లంబసింగి, గండికోట టూరిస్టు ప్రదేశాల్లో రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ప్రీ ఫీజబులిటీ అధ్యయనం కొనసాగుతోంది. ఈ అధ్యయనం మార్చి లోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒక్కో రోప్ వే ప్రాజెక్టుకు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచన.