Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రెండో టీ20లో ఆస్ట్రేలియాపై సూపర్ ఓవర్లో గెలుపోందిన భారత మహిళల జట్టుకు మూడో టీ20లో నిరాశను మిగిల్చింది. బుధవారం మూడో టీ20లో 21 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్‌పై విజయంలో విఫలం అయ్యింది. ఎలీస్ పెర్రీ (75) 47 బంతుల్లో 9×4, 3×6), గ్రేస్ హారిస్ (41), బెత్ మూనీ (30) రాణించడంతో మొదట ఆసీస్ 8 వికెట్లకు 172 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో రేణుక (2/24), దేవిక వైద్య (2/22), తెలుగమ్మాయి అంజలి శ్రావణి (2/34) సత్తా చాటారు. ఛేదనలో భారత్ 7 వికెట్లకు 151 పరుగులే చేసింది. షెఫాలి(52) 41 బంతుల్లో (6×4, 3×6) భారత్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చినా మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. షెఫాలి ఔటయ్యాక హర్మన్‌ప్రీత్ (37), దీప్తి శర్మ (25 నాటౌట్) పోరాడినా జట్టును గెలుపుదిశగా నడిపింపలేక పోయారు.