Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోవిడ్ కాలం ప్రారంభమైనప్పటి నుంచి రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై ఇచ్చే రాయితీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై ఇస్తున్న రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా రైల్వే మంత్రిని ప్రశ్నించగా దీనిపై మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గతేడాది ప్రయాణికుల సేవలపై సబ్సిడీ కింద రూ.59,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు.
రైల్వేశాఖపై పెన్షన్, జీతాల భారం కూడా చాలా ఎక్కువగా ఉందన్నారు. అయితే, ప్రయాణికుల సేవల సబ్సిడీపై రైల్వే రూ.59,000 కోట్లు వెచ్చించాల్సి ఉందని, ఇది మరింత భారంగా మారుతోందని, ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువని, గతేడాది సబ్సిడీపై రైల్వేశాఖ రూ.59 వేల కోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. రైల్వే కొత్త సౌకర్యాలు తీసుకువస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాం. అయితే ప్రస్తుతానికి రైల్వేల పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని రైల్వే మంత్రి విజ్ఞప్తి చేశారు.