Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి తన చాంబర్‌లో కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులు కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. తన చాంబర్‌లో తొలిసారి ఆశీనులైన కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ అద్యక్షుడిగా లెటర్ హెడ్‌పై మొదటి సంతకం చేయగా బీఆర్ఎస్‌కు అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితిని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింఘ్ చడూని, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమిస్తూ వారికి పత్రాలు అందించారు.