Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ 2018లో 37 ఏళ్ల మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ తరుణంలో తన భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని, ఆ వ్యక్తి సెల్‌ఫోన్ సమాచారాన్ని విశ్లేషిస్తే అసలు విషయం తెలుస్తుందన్న భర్త విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అలా పరిశీలించడం వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పింది. భార్యాభర్తల విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది ఆ వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. నాగప్రసన్న అన్నారు.