Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 72వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ తరుణలో ఇషాన్ కిషన్ ఐఐసీ బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో 117 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లి కూడా మెరుగుదలను పొందాడు. అంతేకాకుండా ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో తన 72వ సెంచరీని నమోదుచేశాడు. 2019 ఆగస్టు తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ.