Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు తరచూ ఫారెస్టు ఏరియాలో షికారుకు వెళ్తుంటాడు. ఉడుములు, ఇతర చిన్నపాటి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం రాజు షికారుకంటూ వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బుధవారం మధ్యాహ్నం అతడిని వెతుక్కుంటూ ఫారెస్టు ఏరియా లోపలికి వెళ్లారు. తరచూ అతను తిరిగే ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు.
అయితే సింగరాయిపల్లి శివారులోని పెద్ద రాళ్ల గుట్ట మధ్యలో నుంచి అరుపులు వినిపించడంతో లోపలి నుంచి అరుస్తున్న వ్యక్తిని రాజుగా గుర్తించారు. రాళ్ల మధ్య సందులో ఇరుక్కుపోగా బయటకు కాళ్లు మాత్రమే కనిపిస్తుడడంతో బయటకు తీసేందుకు కుటుంబీకులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఘటనా స్థలానికి పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ ఆఫీసర్లు, సిబ్బంది చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్చేపట్టగా రాళ్లగుట్ట పక్కన జేసీబీతో తవ్వుతూ రాత్రి 12 గంటల వరకు కూడా బయటకు తీయలేకపోయారు.