Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని బుధవారం గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆవిష్కరించారు. ఈ తరుణంలో గవర్నర్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని, మారుమూల గ్రామాల్లోని నిరుపేద పిల్లల్ని నవభారత రూపకర్తలుగా మార్చేలా తగిన మార్గదర్శకత్వం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
కలాంను ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించారు. దేశ స్వావలంబన కోసం రక్షణ, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఆయన విశేష సేవలందించారని కొనియాడారు. ఎంతో వినయ విధేయతలు, నిరాడంబరత కలిగిన కలాం యువతకు స్ఫూర్తి అని, తుదిశ్వాస వరకు దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మిసైల్ మ్యాన్ సాధించడానికి ఆకాశమే హద్దు అంటూ కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారని స్మరించుకున్నారు.
కలాంను తీర్చిదిద్దిన మద్రాస్ ఐఐటీ ఎంతైనా ప్రశంసనీయమన్నారు. మద్రాస్ ఐఐటీ వ్యవస్థాపకుడు, జాతీయ వాది సి.రాజం దార్శనికుడని, ఆయన గొప్ప సేవలందించారని కొనియాడారు. 2047 నాటికి భారత్ విశ్వగురువుగా పరిణమించే తరుణంలో వుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నా యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్. వేల్‌రాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ జి.రవికుమార్, మద్రాస్ ఐఐటీ డీన్ డాక్టర్ జె.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.