Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారెల్ ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ హౌసింగ్ సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ఫ్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.