Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ ఉదయం మరో 126 రన్స్ జోడించిన ఇండియా చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మొత్తం 133.5 ఓవర్లలో ఇండియా 404 రన్స్ చేసింది. లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్ అశ్విన్ తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. 58 రన్స్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కుల్దీప్ కూడా 40 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఉమేశ్ యదవ్ రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్, మెహిదిలు చెరో నాలుగేసి వికెట్లు తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ సిరాజ్ వేసిన మొదటి బంతికే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ శాంతో క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఐదు ఓవర్లకు 8 పరుగులతో 2 వికెట్లు కోల్పోయింది.