Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: యాజమాన్య కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు మరోసారి రిజిస్ట్రేషన్‌కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. మేనేజ్‌మెంట్ కోటా బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ, ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాళీ సీట్లకు మరో అవకాశం కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ stray వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్‌కు ప్రకటన విడుదల చేసింది.
అభ్యర్థులు నేరుగా ఈ నెల 17వ తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలసి ఉంటుంది. పూర్తివివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని వర్సిటీ వర్గాలు తెలిపాయి.