Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్
హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలవంతంగా నూతన విద్యా విధానం (ఎన్ ఇ పి) అమలుకు చర్యలు తీసుకుంటుందని, ఆ ప్రయత్నాలను విరంమించు కోకుంటే దేశ వ్యాప్తంగా మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ హెచ్చరించారు. ఎస్ ఎఫ్ ఐ జాతీయ మహాసభల్లో భాగంగా గురువారం ఆయన గుజరాత్, కాశ్మీర్ రాష్ట్రాల ఎస్ ఎఫ్ ఐ నాయకులు సతీషా, హకీబ్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేయటం వల్ల భవిష్యత్తులో దేశానికి నికార్సైన నాయకత్వం కరువవు తుందని చెప్పారు. గుజరాత్ మోడల్ అంటే విద్యా వ్యవస్థను ధ్వంసం చే య ట మే అన్నారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ ను రద్దు చేశారని చెప్పారు.
నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయ విద్యా విధానం పై చర్చించామన్నారు. ఎన్ ఇ పి తో స్టేట్ బోర్డు లు రద్దవుతాయని, దానివల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని వివరించారు.
ఎన్ ఇ పి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదని అది నేషనల్ ఎక్స్ క్లుసన్ పాలసీ అని మయుక్ పేర్కొన్నారు. గుజరాత్ ఎస్ ఎఫ్ ఐ నాయకురాలు సత్యే షా మాట్లాడుతూ, గుజరాత్ లో 6వేల ప్రభుత్వ పాటశాల లను మూసి వేసార ని చెప్పారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, హాస్టల్స్ లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న ఎస్ ఎఫ్ ఐ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎ బి విపీ, అర్ ఎస్ ఎస్ గుండాలు దాడులు చేస్తున్నారని చెప్పారు. గుజరాత్ లో 13 పర్యాయాలు సి బి ఎస్ ఇ పేపర్లు లీకయ్యాయని సత్యే షా పేర్కొన్నారు. కాశ్మీర్ ఎస్ ఎఫ్ ఐ నాయకుడు యూసుఫ్ మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత నియంతృత్వం పెరిగిందన్నారు. వామపక్ష ప్రగతి కాముక శక్తులపై నిర్బంధం ఉందని, ప్రతీకూల పరిస్థితులను ఎదుర్కొంటూ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ కార్యదర్శి నాగరాజు, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎస్ కే జాన్ బషీర్ పాల్గొన్నారు.