Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ కంటే ఇంకా 271 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 404 పరుగుల వద్ద ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే దెబ్బ తగిలింది. సిరాజ్ సంధించిన తొలి బంతిని ఆడడంలో కంగారు పడిన ఓపెనర్ నజ్ముల్ హొసైన్.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అది మొదలు బంగ్లాదేశ్ వికెట్లు టపటపా రాలిపడ్డాయి. సిరాజ్, కుల్దీప్ యాదవ్ బంతుల వేడికి తట్టుకోలేని బంగ్లా బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. యాసిర్ అలీ (4), లిటన్ దాస్ (24), జకీర్ హసన్(20), షకీబల్ హసన్ (3), నురుల్ హసన్ (16), తైజుల్ ఇస్లామ్ (0) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.