Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు గాయపడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మైసూరు జిల్లా హున్సూర్ తాలూకాలోని ధర్మపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 47 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాలోని తుమరి సమీపంలో వక్కోడి వద్ద ఆ స్కూల్ బస్సు ఒక పక్కకు ఒరిగి పడింది. ఈ ప్రమాదంలో 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే స్పందించారు. గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రభుత్వ స్కూల్ బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూల్ బస్సు వేగంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక రాజకీయ నేతలు ఆసుపత్రికి క్యూ కట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు.