Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కన్నడ హీరో యశ్ ను కలవడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కేజీఎఫ్ స్టార్ యశ్ హైదరాబాద్ రాగా, ఓ హోటల్ లో ఆయనను లోకేశ్ కలిశారు. అయితే ఇరువురికి అంతకుముందు పరిచయం లేకపోవడంతో, లోకేశ్ చొరవ తీసుకుని తాను నారా చంద్రబాబునాయుడు కొడుకునని పరిచయం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆపై, ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఏం చర్చకు వచ్చిందన్నది మాత్రం తెలియరాలేదు. లోకేశ్, యశ్ మాట్లాడుకుంటున్నప్పటి ఫొటోలను ఐటీడీపీ ట్విట్టర్ లో పంచుకుంది.