Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్నాటకలో బజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బస్సు దిగుతుండగా మహిళకు సాయం చేశాడని, ఆమెతో మాట్లాడాడనే ఆగ్రహంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తిని (45) బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూదిబిదిరె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని ఇషాక్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్ నుంచి దిగుతుండగా ఓ మహిళ తన బ్యాగ్‌ను పట్టుకోమని ఇషాక్‌కు ఇచ్చింది. దీంతో మహిళతో ఎందుకు మాట్లాడుతున్నావని ఇషాక్‌ను బస్ కండక్టర్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఈ విషయం చేరవేయడంతో వారు ఘటనా స్ధలానికి చేరుకుని ఇషాక్‌ను బస్ నుంచి కిందకు దించి తమతో తీసుకువెళ్లారు. ఆపై ఇషాక్‌ను తీవ్రంగా కొట్టి వేధింపులకు గురిచేశారు. కాగా ఇషాక్ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని కండక్టర్ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.