Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలో బుధవారం యాసిడ్ దాడికి గురైన 17 ఏళ్ల బాలిక స్పృహలోకి వచ్చింది. అయితే.. ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుడపడలేదు. ఆమె ఇంకా ఐసీయూలోనే ఉందని డాక్టర్లు తెలిపారు. సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలోని బర్న్ ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వచ్చింది. చికిత్సకు స్పందిస్తోంది. బాలిక ముఖానికి 8 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కళ్లు కూడా దెబ్బతిన్నాయి. ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతోంది. ఆఫ్తల్మోలజిస్ట్‌లు ఆమెను పర్యవేక్షిస్తున్నారు అని ఒక సీనియర్ డాక్టర్ తెలిపాడు. బాధితురాలు బుధవారం ఉదయం సోదరితో కలిసి ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్‌కు బయలు దేరింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. ముసుగులు వేసుకున్న ఆ ఇద్దరు నంబర్ ప్లేట్ లేని బండి మీద వచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడు సచిన్ అరోరా, విరేందర్ సింగ్, హర్షిత్ అగర్వాల్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. సచిన్ యాసిడ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నాడని ప్రత్యేక పోలీసు కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా వెల్లడించారు. యాసిడ్ అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ యాసిడ్ దాడి జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.