Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 310 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 350 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,530 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49, 990 గా నమోదయింది. ఇక వెండి ధరలు కూడా భారీగానే తగ్గు ముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి ధర రూ.1300 తగ్గి, రూ. 72700 గా నమోదు అయింది.