Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తొమ్మిది మరణించారు. మరో 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కనిపించకుండా పోయినవారికోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కనున్న ఓ ఫామ్‌మౌస్‌ను క్యాంపుగా ఏర్పాటు చేసుకున్నారని వెల్లడించారు. కార్మికులు, అధికారులు అందులో నిద్రిస్తున్న సమయంలో క్యాంపు వెనక ఉన్న కొండపై నుంచి విరిగిపడ్డాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అందులో 79 మంది ఉన్నారని, వారిలో 23 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. తొమ్మిది మంది మరణించగా, మరో 25 మంది ఆచూకీ లభించడం లేదన్నారు.