Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనుమకొండ: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు బలపడ్డాయని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని గ్రామాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నివిధాల అభివృద్ది చెందాయని, దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం, మైలారం గ్రామానికి చెందిన పలు కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. ఈ సందర్భంగా తమకు కమ్యూనిటి హాళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.