Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర మాజీ ఎమ్మెల్యే సీనియర్ బీజేపీ నేత వీఎస్ పాటిల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. బెంగళూరు క్వీన్స్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయనను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యలు పార్టీ పతాకాన్ని అందజేసి సాదరంగ పార్టీలోకి అహ్వానించారు. యల్లాపురలో బీజేపీని బలోపేతం చేసినా తమకు తీరని అన్యాయం జరిగిందని పాటిల్ ఈ సందర్భంగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి బాధ్యతను అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధమని పాటిల్ ప్రకటించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో యల్లాపుర నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం పాటిల్ పేరును పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన శివరాం హెబ్బార్ ఆపరేషన్ కమల సమయంలో బీజేపీలో చేరిపోయి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనను ఓడించేందుకు ఈ సారి కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. కాగా పాటిల్‌తో పాటు యల్లాపుర బీజేపీ నేత శ్రీనివాస్ భట్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. పరిషత్ ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్, సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే కూడా హాజరయ్యారు.