Authorization
Sat May 17, 2025 12:42:44 am
హైదరాబాద్: పూణెలోని కోరేగావ్ పార్క్ ఏరియాలోని ఓ బిజీ రోడ్డులో బెంజ్ కార్ బ్రేక్ డౌన్ అయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. దగ్గర్లోని మెకానిక్ షెడ్డుకు కారును తరలించేందుకు సాయం కోసం చూశాడా డ్రైవర్ అయితే, అందరూ తమ తమ పనులపై బిజీబిజీగా వెళ్తుండడంతో మెర్సిడెస్ కారు డ్రైవర్ అసహాయంగా ఉండిపోయాడు.
ఇంతలో ఓ ఆటో వచ్చి కారు పక్కన ఆగింది. కారు పరిస్థితి చూసిన ఆటో డ్రైవర్ సాయానికి ముందుకొచ్చాడు. బైక్ పై కూర్చుని మరో బైక్ ను తోసుకెళ్లినట్లు తన ఆటో నడుపుతూ కాలితో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. దగ్గర్లోని మెకానిక్ షెడ్డు దాకా కారును అలాగే తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.