Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు భారత రత్న ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆశావాహక దృక్పదాన్ని వ్యక్తం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అమితాబ్ ఓ లెజెండ్ అని, ఇండియాకు ఐకాన్ అని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని అన్నారు. అధికారికంగా కాకపోయినా బెంగాలీల గొంతును వినిపిస్తున్నామని, భారత రత్న అమితాబ్‌జీ అంటూ ఆమె నినాదం చేశారు. చిత్ర పరిశ్రమకు అమితాబ్ చేసిన సేవలు అనితరసాధ్యమని ఆమె కొనియాడారు.