Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వేలికి గాయం కావడంతో రోహిత్ మూడో వన్డే ఆడలేకపోయాడు. ఆ తర్వాత ఈ నెల 14 నుంచి మొదలైన తొలి టెస్టుకు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దాంతో మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టును లీడ్ చేస్తున్నాడు. మూడో వన్డేతోపాటు, ఇప్పుడు జరుగుతున్న తొలి టెస్టుకు కూడా ఆయనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, గాయం కారణంగా ముంబైకి వచ్చిన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రోహిత్ శర్మ గాయం నయమవుతున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ నెల 22న మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్ (అదే ఆఖరి టెస్టు మ్యాచ్ కూడా) కల్లా అతని గాయం పూర్తిగా నయమవుతుందని, దాంతో అతడు బంగ్లాదేశ్‌కు వెళ్లి రెండో టెస్టు మ్యాచ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహిస్తాడని తెలుస్తుంది.