Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ అమన్ విహార్ ప్రాంతంలో దుండగులు ఒక మహిళపై కాల్పులు జరిపి హత్య చేశారు. గురువారం ముగ్గురు దుండగులు ప్లాన్ ప్రకారం కాపలా కాసి డోర్ తీసిన పెద్ద వయసు మహిళపై గేట్ వద్ద ఉన్న వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రోడ్డు వద్ద కాపాలా ఉన్న వ్యక్తితోపాటు మరో వ్యక్తిని అతడు కలుసుకున్నట్లు తెలుస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. గన్ కాల్పుల్లో చనిపోయిన మహిళ 55 ఏళ్ల గీత అని, ఏడాది కిందట ఆమె కుమారుడు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. దీనిని సహించని యువతి కుటుంబం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా హంతకులను గుర్తించి అరెస్ట్ చేశారు.