Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిన్న భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ప్రపంచ ఆర్థికమాంద్యం గురించి ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దాంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 461 పాయింట్లు కోల్పోయి 61,337కి పడిపోయింది. నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 18,269కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. బేసిక్ మెటీరియల్స్ సూచీ 3 శాతానికి పైగా పతనమయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: హెచ్డీఎఫ్టీ బ్యాంక్ (0.49%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.30%), నెస్లే ఇండియా (0.19%), టాటా స్టీల్ (0.05%).
టాప్ లూజర్స్: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-3.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.44%), ఏసియన్ పెయింట్స్ (-2.19%), టీసీఎస్ (-2.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.98%).