Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో గత శుక్రవారం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో దానిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో యాత్ర సాగిస్తున్న రాహుల్ శుక్రవారంనాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును దాచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చైనా చొరబాట్లకు మాత్రమే పరిమితం కాకుండా యుద్ధానికి సన్నద్ధమవుతోందని, కేంద్రం మాత్రం చైనాకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా లేదన్నారు.
భారత్‌కు చెందిన 200 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తమ అధీనంలోకి తీసుకుందని రాహుల్ మండిపడ్తారు. చైనా నుంచి ముప్పు ఉందని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది. గత రెండుమూడేళ్లుగా ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నా. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పు విషయాన్ని దాచిపెట్టడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ జరగకూడదని అన్నారు.