Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని వెంకటాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇంటి మొత్తానికి వ్యాపించడంతో కుటుంబ సభ్యులతోపాటు మరో వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలు, సింగరేణి ఉద్యోగి శాంతయ్య మరణించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ అఖిల్ మహాజన్.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.