Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల విచిత్ర వివాహాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అమ్మాయి, అబ్బాయి మధ్య వివాహాలు జరిగితే ఇటీవల ఆ ట్రెండు కొంత మారింది. అమ్మాయి-అమ్మాయి, అబ్బాయి-అబ్బాయి మధ్య వివాహాలు పెరుగుతున్నాయి. అడపాదడపా ఇలాంటి వివాహాలు జరుగుతున్న ఇలాంటివి ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వీణవంకకు చెందిన ట్రాన్స్‌జెండర్ సంపత్ ఇంట్లోంచి వెళ్లిపోయి చాలా ఏళ్లపాటు ఎక్కడెక్కడో తిరిగి చివరికి జగిత్యాల చేరుకున్నాడు. ఈ క్రమంలో కారు డ్రైవర్ అర్షద్‌తో సంపత్‌కు పరిచయం అయింది. ఆ పరిచయం మరింత పెరిగింది. దీంతో పెళ్లి చేసుకుందామని అర్షద్ ప్రతిపాదించాడు. అయితే, అందుకు సంపత్ నిరాకరించాడు. అయినప్పటికీ అర్షద్ ఐదేళ్లుగా ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. దీంతో చలించిపోయిన సంపత్ ఇటీవల లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న సంపత్ తన పేరును దివ్యగా మార్చుకున్నాడు. నిన్న వీరిద్దరూ ఇల్లందకుంట రామాలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరి వివాహం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.