Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గణితం, ఆంగ్ల సబ్జెక్టులను సరిగా బోధించని ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అదనపు కలెక్టర్ తన తనిఖీలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, లోపాలకు కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడంతో డీఈవో నోటీసులు జారీచేశారు. ఈ తరహా ఘటన ఇటీవలి కాలంలో విద్యాశాఖలో ఇదే ప్రథమమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. వివరాల్లోకి వెళ్లితే... వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మచ్చాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ (ఐఏఎస్) గురువారం సందర్శించారు. 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులచే ఇంగ్లీష్ పాఠాన్ని చదివించగా.. ఎవరూ సరిగా చదవలేదు. ఆ తర్వాత గణిత ప్రక్రియలను చేయించగా.. ఎవరూ సరిగా చేయలేదు. దీంతో అదనపు కలెక్టర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయుల బోధన సరిగా లేదని ఆమె నిర్ధారించారు. వెంటనే డీఈవో వాసంతికి ఫోన్ చేసి, సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఇంగ్లీష్ టీచర్ టి.సూరయ్య, మ్యాథ్స్ టీచర్ కె.రాజేంద్రప్రసాద్‌లకు డీఈవో షోకాజ్ నోటీ సులు జారీ చేశారు. ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి...’ అని షోకాజ్ నోటీస్‌లో పేర్కొన్నారు. బోధన సరిగా లేదనే కారణంతో ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం ఉపా ధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.