Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా: అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో భూకంపం సంభవించింది. చమురు వెలికితీత సాగుతున్న టెక్సాస్ పశ్చిమ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.మిడ్‌ల్యాండ్‌కు ఉత్తర వాయువ్యంగా 22 కిలోమీటర్ల దూరం భూకంపం కేంద్రీకృతమై ఉంది,భూకంపం లోతు 9 కిలోమీటర్లు అని యూఎస్ అధికారులు చెప్పారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో నాల్గవ భూకంపం అని మిడ్‌ల్యాండ్‌లోని నేషనల్ వెదర్ సర్వీసెస్ కార్యాలయం ట్వీట్ చేసింది. టెక్సాస్‌లోని అమరిల్లో, అబిలీన్ నుంచి పశ్చిమాన కార్ల్స్‌బాడ్ వరకు ఉన్న ప్రజలు భూకంపం బారిన పడ్డారని కొలరాడోలోని యూఎస్‌జీఎస్ జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని జియోఫిజిసిస్ట్ జానా పర్స్లీ చెప్పారు.ఈ భూకంపంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. గత నెలలో పశ్చిమ టెక్సాస్‌లో కూడా ఇదే స్థాయిలో భూకంపం సంభవించింది.