Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయిల్ మిల్లులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా మిల్లు మొత్తానికి మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మిల్లు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను పోలీసులు ఖాళీచేయించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్క్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహానీ కలగనప్పటికీ
భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.