Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్థానిక చెన్నై మీనాంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.86లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీ చేశారు. వీరిలో చెన్నైకి చెందిన యువకుడి వద్దనున్న బ్యాగ్‌లలో తనిఖీ చేసినా ఏవీ లభించలేదు. అయితే అతడి ప్రవర్తన కాస్త వింతగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక గదికి తీసుకెళ్ళి తనిఖీ చేశారు. చివరకు అతడి లోదుస్తులలో దాచి వుంచిన రూ.86లక్షల విలువైన బంగారు నగలు, బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.