Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ పార్ట్-1 ఏరియాలోగల ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్‌లో ఇవాళ ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దాంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్‌లతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.