Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చిన్నారి ఇందుకు మంత్రి మల్లారెడ్డి నివాళులర్పించారు. శనివారం ఉదయం చిన్నారి నివాసానికి చేరుకున్న మంత్రి... చిన్నారి ఇందు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం ఇందు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇందు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందు కుటుంబసభ్యులకు స్థానిక మేయర్ ప్రజాప్రతినిధులు కలిసి లక్ష పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరు పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తామని, తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. చెరువు దగ్గర సీసీటీవీతో పాటు నిఘా పెంచుతామని తెలిపారు. బాధ్యులను త్వరగా గుర్తించే విధంగా రాచకొండ సీపీతో మాట్లాడతానని మంత్రి మల్లారెడ్డి భరోసా ఇచ్చారు.