Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన బాధితురాలు బిల్కిస్ బానోకు చుక్కెదురైంది. ఆమె వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం విచారణకు తీసుకోకుండానే తిరస్కరించింది. 2002 నాటి ఘటనలో నిందితులైన ఈ 11 మందిని 2008లో దోషులుగా గుర్తిస్తూ కోర్టు వీరికి శిక్ష విధించింది. అనంతరం గుజరాత్ రిమిషన్ పాలసీ కింద ఈ ఏడాది ఆగస్టు 15న వీరిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో బిల్కిస్ (21) ఐదు నెలల గర్భవతి. నింధితులు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అంతే కాకుండా ఆమె మూడేళ్ల కూతురితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని అతి కిరాతకంగా హత్య చేశారు. వారి విడుదల సందర్భంలో ఖైదీలకు రాచమర్యాదలతో స్వాగతం పలికిన విషయం విధితమే